- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చోరీకి యత్నించిన దొంగల అరెస్ట్
దిశ, చైతన్య పురి : బంగారు నగలు చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన మంగళవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం… అల్కాపురి లోని రోడ్ నెంబర్ 5 లో నివసించే వెంకట రమణి ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లోపలి నుండి గడియపెట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మెడలోని నానుసూత్రం, చంద్రహారంను బలవంతంగా లాక్కున్నాడు. వెంటనే రమణి తేరుకుని అతన్ని ప్రతిఘటించి లాక్కున్న బంగారు వస్తువులను తిరిగి ఆమె గుంజుకుంది. ఆమె గట్టిగా అరుస్తూ ప్రతిఘటించగా గుర్తు తెలియని వ్యక్తి పారిపోయాడు. రమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఈకేసులో చైతన్యపురి క్రైమ్ సిబ్బంది వెంటనే స్పందించి సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో 24 గంటల లోపు చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించామని తెలిపారు. స్నేహపురి కాలనీకి చెందిన మోముల సంగమేష్, కామారెడ్డి కి చెందిన విస్లావత్ వంశీ లను పట్టుకొని అరెస్ట్ చేసి ఇరువురిని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి కేసులు మూడు ఛేదించినట్లు ఆయన తెలిపారు.