ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్ టార్గెట్.. రంగంలోకి ఐసీసీ

by Sathputhe Rajesh |
ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్ టార్గెట్.. రంగంలోకి ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఓకే చెప్పేలా కన్విన్స్ చేసేందుకు ఐసీసీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదమై ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు సమాచారం . టోర్నమెంట్ నిర్వహణకు హైబ్రిడ్ మోడల్ బెస్ట్ అని.. భారత్ లేకుండా టోర్నమెంట్ నిర్వహణలో ఉన్న చిక్కులను పీసీబీకి ఐసీసీ వివరించినట్లు తెలిసింది. ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదని ఐసీసీ చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల్లో టోర్నీ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఆతిథ్య పాకిస్తాన్, టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలతో ఐసీసీ సంప్రదింపులు జరిగిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియా పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ‘నో’ చెప్పడంతో యూఏఈలోనే భారత్ మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. 2023లో జరిగిన న్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఇండియాలో పర్యటించింది. భారత్ మాత్రం గతేడాది పాక్‌లో నిర్వహించిన ఆసియన్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్‌లో పాల్గొంది. శ్రీలంకలో ఇండియా తన మ్యాచ్‌లను ఆడింది. 2012-13లో రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. తర్వాత కేవలం ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియా కప్‌లో మాత్రమే రెండు దేశాలు పరస్పరం తలపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed