- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: వైరల్ అవ్వడం కోసం వెర్రి చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్: ఫేమస్(Famous) అవ్వడం కోసం ఓ యువతి చేసిన పనికి నెటిజన్లు(Netizens) దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల కాలంలో సామాజిక మాద్యమాల్లో(Social Media) ఫాలోవర్లు(Followers) పెరగడం కోసం యువత ఎంతటి దారుణానికైన ఒడిగడుతున్నారు. వైరల్(Viral) అవ్వడం కోసం వెర్రి చేష్టలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వీడియోలో యువతి చేసిన పని సోషల్ మీడియాలో నెటిజన్ల నోటికి పని చెప్పింది. ఇందులో యువతి రైల్వే స్టేషన్(Railway Station) లో మెట్ల మీది నుంచి దిగుతూ.. ఒక్కసారిగా సృహ కోల్పోయి మెట్లపై దొర్లుతూ వస్తోంది.
ఇది చూసిన తోటి ప్రయాణికులు మానవత్వంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె అకస్మాత్తుగా పైకి లేచి నవ్వడంతో రీల్స్(Reels) లో నటిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారి వల్లే మనుషుల్లో మానవత్వం దెబ్బతింటోందని, రైల్వేబోర్డు(Railway Board) తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఆ యువతిని వెంటనే అరెస్ట్(Arrest) చేయాలని కామెంట్లు పెడుతున్నారు.