నేరుగా దుకాణాల్లోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది దుర్మరణం

by Mahesh |
నేరుగా దుకాణాల్లోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: గాల్లో ఎగరాల్సిన విమానం( plane).. నేరుగా రోడ్డుపై ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లడంతో.. భారీ ప్రమాదం చోటు చేసుకోని 10 మంది మృతి(10 people died) చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బ్రెజిల్(Brazil)లోని టూరిస్ట్ సిటీ గ్రామాడోలో పైలట్ సహా మొత్తం 30 మందితో వెళ్తున్న విమానం.. వాతావరణం సహకరించకపోవడంతో రోడ్డుపైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లోకి విమానం దూసుకెళ్లిగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో.. పైలట్ సహా 10 మంది మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమాచారం తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed