- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌లో ఆ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా: శంకర్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్(Srikanth) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పలుచోట్ల ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.
తాజాగా, డల్లాస్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) జరగ్గా.. ఇందులో శంకర్ పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాను. అందుకే ఇక్కడకు రావాలా ? వద్దా ? అని ఆలోచించాను కానీ చివరకు రావాల్సి వచ్చింది. అయితే పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అందులోనూ నా మార్క్ ఉండాలని కోరుకున్నాను. అదే ఆలోచనతో చేసిందే ఈ సినిమా. తమిళంలో, హిందీలో చేశా కానీ తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ నా తొలి చిత్రం.
అయితే ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ చుట్టూ గేమ్ చేంజర్ కథ తిరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ చాలా సెటిల్డ్ గా నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ నటనతో మెప్పిస్తారు. అయితే నేను ఒకానొక సమయంలో చిరంజీవి(Chiranjeevi)తో ఓ మూవీ చేయాలని అనుకున్నాను.. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu)తో చేయాలనుకున్నాను. కానీ సెట్ కాలేదు. చివరకు కరోనా సమయంలో ప్రభాస్(Prabhas) తో కూడా చర్చలు జరిపాను. అదీ అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా రాసిపెట్టి ఉంది. ’’ అని చెప్పుకొచ్చారు.