అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

by Mahesh |   ( Updated:2024-12-23 05:25:50.0  )
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్, జూబ్లీహిల్స్: పుష్ప-2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతిని నిరసిస్తూ ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.అల్లు అర్జున్ ఇంటి పై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ దాడి చేశారు. బన్నీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, నేడు వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు. అయితే దాడి చేసి అరెస్ట్ అయిన నిందితుల్లో కొడంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ , ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ కుమార్ గౌడ్ వున్నారు. గతంలో వీరు ఇరువురు సీఎం రేవంత్ రెడ్డి తో దిగిన ఫోటో లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కొంత మంది నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed