BRS: మహిళా శక్తి విజయోత్సవం ఇదేనా..? బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి

by Ramesh Goud |
BRS: మహిళా శక్తి విజయోత్సవం ఇదేనా..? బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో వరంగల్(Warangal) లో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన భోజనం ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో కొందరు వ్యక్తులు డీసీఎం వాహనం పైకి ఎక్కి భోజనం ప్యాకెట్లను ప్రజల మధ్యకు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను వరంగల్ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి(Anugula Rakesh Reddy) ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ప్రభుత్వం(Government)పై పలు విమర్శలు(Criticize) చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రేవంత్ రెడ్డి.. ఆర్భాటంగా ఓరుగల్లులో మీరు పెట్టిన మహిళా శక్తి విజయోత్సవం ఇదేనా అని ఎద్దేవా చేశారు. అంతేగాక పేద మహిళలపై మీకు, మీ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇక హామీలు అమలు పక్కన పెట్టండి. కానీ, ఆత్మగౌరవం అయినా ఇవ్వండి రాకేష్ రెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు.



Next Story

Most Viewed