Fake Doctors : ఫేక్ సర్టిఫికెట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.. గుజరాత్ సూరత్‌లో షాకింగ్ ఘటన

by Sathputhe Rajesh |
Fake Doctors : ఫేక్ సర్టిఫికెట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.. గుజరాత్ సూరత్‌లో షాకింగ్ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో : నకిలీ ధృవపత్రాలతో ఏకంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తెరవడం సంచలనంగా మారింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఐదుగురు హాస్పిటల్ ఫౌండర్స్‌లో ఇద్దరు ఫేక్ పట్టాలు పొందినట్లు గుర్తించాం. మిగిలిన ముగ్గురి సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు ఉన్నాయి. సమగ్ర విచారణ చేపట్టాం. సూరత్‌ పండేసరాలో జన్‌సేవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశాం.’ అని పోలీసులు వెల్లడించారు. సూరత్ మున్సిపల్ కమిషనర్ శాలిని అగర్వాల్, పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్, జాయింట్ పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఇన్విటేషన్ కార్డులో పేర్లను ముద్రించారు. అయితే ఈ ముగ్గురిని నిర్వాహకులు అసలు ఈవెంట్‌కు ఆహ్వానించలేదని విచారణలో తేలింది. బీఆర్ శుక్లా ఆయుర్వేదిక్‌ మెడిసిన్ డిగ్రీ, ఆర్కే దూబే ఎలక్ట్రో-హోమియోపతి చేసినట్లు ఆసుపత్రి ప్రచార కరపత్రంలో పేర్కొన్నారు. ఇవి ఫేక్ అని తేలడంతో వీరిపై మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి విజయ్ సింగ్ గుర్జార్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story