యాసంగి సాగుకు నీరిస్తాం : ఖానాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
యాసంగి సాగుకు నీరిస్తాం : ఖానాపూర్ ఎమ్మెల్యే
X

దిశ,జన్నారం : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని యాసంగి పంటకు నీరందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్, రోటీగూడా, పోన్కల్, రేండ్లగూడ, దేవునిగూడెం, కవ్వాల్, మొర్రి గూడా, గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా కిష్టాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని అన్నారు.వచ్చే యాసంగి పంటకు కడెం ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని పేర్కొన్నారు. రైతులు ఏడాది పాటు శ్రమించి పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.

కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలను కలిపిస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. సన్నరకం వడ్లను కొనుగోలు కేంద్రంలో అమ్మి నట్లయితే రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. కవ్వాల్ గ్రామంలో ఇటీవల మరణించిన జునుగురి పవన్ కుటుంబాన్ని పరామర్శించి, మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు షేక్ మౌలానా ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ, మండల వ్యవసాయ శాఖ అధికారిణి సంగీత, పొనకల్, చింతగూడ పీఏసీఎస్ చైర్మన్లు అల్లం రవి, నాసాని రాజన్న, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ సీనియర్ నేతలు మిక్కిలినేని రాజశేఖర్, ఎ.సుభాష్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, దాముక కరుణాకర్, ఫసి ఉల్లా, సుధీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ఇందయ్య, నందు నాయక్, రమేష్, గంగాధర్, అశోక్, హజార్, షాకీర్ ముజ్జు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story