Brazil : బ్రెజిల్ అధ్యక్షుడిని చంపేందుకు కుట్ర.. ఐదుగురు అధికారుల అరెస్ట్!

by vinod kumar |
Brazil : బ్రెజిల్ అధ్యక్షుడిని చంపేందుకు కుట్ర.. ఐదుగురు అధికారుల అరెస్ట్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వాన్ని పడగొట్టి, అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా (Lula da Silva)ను హత్య చేసేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై ఐదుగురు అధికారులను బ్రెజిల్ పోలీసులు (Brazol police) మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో నలుగురు ఆర్మీ, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు తెలిపారు. 2022 ఎన్నికల్లో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి వీరు ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్‌మిన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డీ మోరేస్‌లను హతమార్చేందుకు కూడా నిందితులు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. నిందితులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి వారి పాస్ పోర్టును సీజ్ చేశారు. ఇతరులను సంప్రదించకుండా చర్యలు చేపట్టారు. కాగా, 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లూలా గెలవగా బోల్సోనారో ఓటమి పాలయ్యాడు. అనంతరం అధికారులతో కలిసి తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed