Trump: ఒబామాతో సీక్రెట్ సంభాషణ.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్

by Shamantha N |
Trump: ఒబామాతో సీక్రెట్ సంభాషణ.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama), తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ల మధ్య జరిగిన రహస్య సంభాషణకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జిమ్మీకార్టర్(Jimmy Carter) అంత్యక్రియల్లో ఇరువురు మాట్లాడుకున్న వీడియో గురించి ట్రంప్ స్పందించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు. ‘పరస్పరం ఇష్టపడే వ్యక్తుల్లా ఇప్పుడు మనం కనిపిస్తున్నాం అని చెప్పా’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. జనవరి 9న అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జరిగాయి. ఆ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈక్రమంలోనే బరాక్‌ ఒబామా, ట్రంప్ సీక్రెట్ సంభాషణ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రత్యర్థులిద్దరూ ఏం చర్చించుకున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా.. దీనిపైనే ట్రంప్ స్పందించారు. మరోవైపు, కమలా హ్యారిస్ సైతం జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ, ట్రంప్, కమలా హ్యారిస్ మాత్రం మాట్లాడుకోలేదు.

Next Story

Most Viewed