- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'మైండ్ యువర్ ఓన్ బిజినెస్' అంటూ ఫొటోస్ షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. పోస్ట్

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక మన టాలీవుడ్‌లో ‘గాడ్సే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీలో తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘కుమారి’, ‘కింగ్ ఆఫ్ కొత్త’ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీతో మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య లక్ష్మి తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని హాట్ స్టిల్స్‌తో ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా.. ‘స్టే మ్యాయిట్యూరేటర్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘ఓ మై గాడ్.. గార్జియస్’, సూపర్, ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.