- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nuclear War: న్యూక్లియర్ వార్ వైపు అడుగులు!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine)ల మధ్య యుద్ధం మొదలై వేయి రోజులు దాటింది. నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ పట్టుబట్టగా.. రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించిన రష్యా.. భవిష్యత్‌లో యూరప్ దేశాలకు ముప్పుగానే పరిణమిస్తుందనే సాకు చెబుతూ పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నాయి. రష్యా వాటిని ధీటుగానే ఎదుర్కొంటున్నది. ఆక్రమిత భూభాగాల్లోని రష్యా దళాలపై ఉక్రెయిన్ తీవ్రంగా దాడి చేస్తు్న్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడిన తర్వాత అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వినియోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చారు. ఈ ఆర్మీ టాక్టిక్ మిస్సైమ్ సిస్టమ్స్(ATacms) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. రాడార్ గుర్తించడం కూడా కష్టం. ఈ అనుమతి సహజంగానే రష్యాను రెచ్చగొట్టినట్టయింది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉక్రెయిన్ అనుమతి పొందిన ఈ క్షిపణులను రష్యాపై ప్రయోగించింది. ఆరు మిస్సైల్స్ ప్రయోగిస్తే అందులో ఐదింటిని కూల్చివేశామని, ఒకదాన్ని డ్యామేజీ చేశామని రష్యా పేర్కొంది. వాటి శిథిలాలు ఆర్మీ శిబిరాల వద్ద పడగా.. ఆ మంటలను ఆర్పివేశామని, ప్రాణనష్టం సంభవించలేదని వివరించింది. ఇదే నేపథ్యంలో రష్యా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా న్యూక్లియర్ ఉపయోగించడానికి గల నిబంధనలను సడలించింది. అణ్వాయుధాలున్న దేశం మద్దతు ఉంటే.. న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాన్ని కూడా శత్రువుగా పరిగణించి న్యూక్లియర్ ఆయుధాలతో దాడి చేసేలా సవరించిన దస్త్రంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం పెట్టారు. ఇదే విషయాన్ని జీ20 సదస్సుకు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ ప్రస్తావిస్తూ.. అమెరికన్ల సహకారం లేకుండా ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడటం అసాధ్యమని, తమ అధ్యక్షుడు పుతిన్ ఇదే విషయాన్ని పలుమార్లు వివరించారని చెప్పారు. రష్యా ఈ ఘర్షణలను తీవ్రతరం చేయాలని భావించడం లేదని, కానీ, తాజా క్షిపణుల దాడితో వారే(అమెరికా, ఉక్రెయిన్) తీవ్రతరం చేయాలని భావిస్తున్నట్టు అర్థమవుతున్నదని వివరించారు. న్యూక్లియర్ యుద్ధం జరగకుండా రష్యా సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటుందని భరోసానిచ్చారు. ఉక్రెయిన్‌కు ఆ మిస్సైళ్ల వినియోగానికి బైడెన్ అనుమతించడాన్ని అమెరికన్లూ తప్పుపట్టారు. మూడో ప్రపంచయుద్ధానికి అడుగులుపడుతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు.