- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ONGC-CIPL: ఒఎన్‌జీసీ నుంచి రూ. 98 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న సిఐపిఎల్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ నోయిడా(Greater Noida)కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ కార్పొరేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (CIPL) ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(IT infrastructure)ను మెరుగుపరచడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఏడేళ్ల ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 98 కోట్లని సిఐపిఎల్ పేర్కొంది. ఒఎన్‌జీసీకి సంబంధించిన ఢిల్లీ(Delhi)లోని కార్పొరేట్ ఇన్ఫోకామ్ డేటా సెంటర్, గుజరాత్(Gujarath) రాష్ట్రం వడోదర(Vadodara)లోని డిజాస్టర్ రికవరీ సైట్ లలో IT హార్డ్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడం లాంటివి ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఈ కాంట్రాక్టు సెప్టెంబర్ 2031 వరకు అమల్లో ఉంటుందని సిఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CIPL MD&CEO) వినోద్ కుమార్(Vinod Kumar) ఓ ప్రకటనలో తెలిపారు.
ఒఎన్‌జీసీకి సంబంధించిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో భాగంగా ఇబ్బందులు లేని డేటా రెప్లికేషన్, డిజాస్టర్ రికవరీ, అప్లికేషన్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో సర్వీసెస్ అందించడం ద్వారా ఆ సంస్థ కార్యకలాపాలకు ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మన దేశంలోనే అతిపెద్ద IT హార్డ్‌వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌లలో ఒకటైన సిఐపిఎల్ 2007 సంవత్సరంలో స్థాపించబడింది. కాగా ఐటీ మౌలిక విభాగాల్లో మూడేళ్ల పాటు సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ నుండి సిఐపిఎల్ ఇటీవలే రూ.114 కోట్ల విలువైన కాంట్రాక్టు పొందింది.