ఇకపై ఏడాదికి మూడు సార్లు సీఏ ఫైనల్స్

by John Kora |
ఇకపై ఏడాదికి మూడు సార్లు సీఏ ఫైనల్స్
X

- ఇప్పటికే మూడుసార్లు ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షలు

- అదే బాటలో సీఏ ఫైనల్స్ పరీక్షలు

- వెల్లడించిన ఐసీఏఐ

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నుంచి సీఐ ఫైనల్ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఇకపై మూడు సార్లు నిర్వహించబడతాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) గురువారం ప్రకటించింది. ఐసీఏఐ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడు సార్లు నిర్వహించాలని నిరుడే నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మూడు సార్లు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచంలోని ఉత్తమ పద్దతులకు అనుగుణంగా, విద్యార్థులకు ఎక్కువ అవకాశాలను అందించడానికి ఐసీఏఐ 26వ కౌన్సిల్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలోతెలిపింది.

ఇకపై సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షలు ప్రతీ ఏడాది మూడు సార్లు రాసే అవకాశం ఉంది. దీని వల్ల విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ఐసీఏఐ పేర్కొంది. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లోనిర్వహిస్తామని తెలిపింది. పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ కూడా త్వరలో మార్పు చెందుతుందని చెప్పింది. గతంలో జూన్, డిసెంబర్‌లలో ఏడాదికి రెండు సార్లు నిర్వహించబడుతున్న ఈ కోర్పు అసెస్‌మెంట్ టెస్ట్.. ఇకపై మూడు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో ఈ పరీక్షలు ఉండబోతున్నాయి.

Next Story

Most Viewed