- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎస్కేకు షాక్.. ఆర్సీబీతో మ్యాచ్ కూడా ఆ బౌలర్ దూరం

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025ను చెన్నయ్ సూపర్ కింగ్స్ విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. శుక్రవారం రెండో గ్రూపు మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబైతో మ్యాచ్‌కు సీఎస్కే స్టార్ పేసర్ మతీషా పతిరణ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. నేడు ఆర్సీబీతో మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. బౌలింగ్ యాక్షన్‌లో మార్పు చేసే క్రమంలో అతను గాయపడినట్టు తెలుస్తోంది. పతిరణ గాయం నుంచి కోలుకుంటున్నాడని ఫ్లెమింగ్ తెలిపాడు. అతను ఇంకా 100 శాతం ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. అయితే, అతను ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే దానిపై సీఎస్కే హెడ్ కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. గత రెండు సీజన్లుగా సీఎస్కే విజయాల్లో పతిరణ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023లో 19 వికెట్లు తీసిన అతను.. గత సీజన్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో చెన్నయ్ ఫ్రాంచైజీ పతిరణను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.