- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్సులో మరిచిపోయిన విలువైన వస్తువును అందజేసిన ఆర్టీసీ సిబ్బంది
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కర్ణాటక ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన విలువైన ప్రింటర్ పార్టును,అందుకు సంబంధించిన ప్రయాణికుడికి అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు మహబూబ్ నగర్ ఆర్టీసీ సిబ్బంది.హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్ళే కర్ణాటక ఆర్టీసీ బస్సులో సాయిగోపాల్ అనే ప్రయాణికుడు హైదరాబాద్ లో బస్సు ఎక్కి 30 వేల రూపాయల విలువైన ప్రింటర్ పార్టును మరచిపోయి..జడ్చర్లలో బస్సు దిగిపోయాడు. వెంటనే మరిచిపోయిన తన వస్తువు గుర్తుకొచ్చి బస్ స్టాండ్ లో బస్సు కోసం వెతికగా..అంతవరకే బస్సు మహబూబ్ నగర్ కు బయలుదేరి వెళ్ళిపోయింది. వెంటనే మహబూబ్ నగర్ డిపో మేనేజర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా,మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో డ్యూటీ లో ఉన్న కంట్రోలర్ చారి బస్సులోని వస్తువును స్వాధీనం చేసుకోని డిఎం సుజాత,ఎస్ఎం రవీందర్ రెడ్డి సమక్షంలో సాయి గోపాల్ కు అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు.ఇందుకు డిఎం సుజాత కు,సిబ్బందికి సాయి గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.