Vishal Megamart IPO: డిసెంబర్లో ఐపీఓకు రానున్న విశాల్ మెగా మార్ట్..!

by Maddikunta Saikiran |
Vishal Megamart IPO: డిసెంబర్లో ఐపీఓకు రానున్న విశాల్ మెగా మార్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయిన కూడా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా దుస్తులు(Clothes), జనరల్ మర్చండైజ్(General Merchandise), ఎఫ్‌ఎంసీజీ(FMCG) లను విక్రయించే సంస్థ విశాల్ మెగామార్ట్(Vishal Megamart) కూడా ఐపీఓ(IPO)కు వచ్చేందుకు రెడీ అయ్యింది. డిసెంబర్ రెండో వారం తర్వాత ఐపీఓకు వస్తుందని సమాచారం. నిజానికి నవంబర్లోనే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాల దృష్ట్యా డిసెంబర్ నెలకు వాయిదా వేసుకుంది.

కాగా ఐపీఓ ద్వారా సుమారు రూ.8000 కోట్లను సమీకరించాలని సంస్థ యోచిస్తోంది. విశాల్ మెగా మార్టులో స్విట్జర్లాండ్(Switzerland) పార్టనర్స్ గ్రూప్ PGHNS కంపెనీకి, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్(Kedara Capital)కు మెజారిటీ వాటా ఉంది. ఈ రెండు సంస్థలు కలిసి ఐపీఓ ద్వారా షేర్లను విక్రయిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశాల్ మెగా మార్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,911 కోట్ల ఆదాయం, రూ.461 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 500కు పైగా స్టోర్లు ఉన్నాయి.

Next Story

Most Viewed