- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంభీర్ ప్రశాంతంగా ఉండు.. టీమిండియా హెడ్ కోచ్‌కు హర్భజన్ సింగ్ సూచన
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే గంభీర్ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..‘పెద్ద జట్లకు కోచ్‌గా ఉండటం కష్టమే. ఎవరికైనా సమయం పడుతుంది.ఆస్ట్రేలియాతో సిరీస్ చాలా కీలకం. చాలా విషయాలు పరీక్షగా నిలుస్తాయి. గంభీర్ కోపం, సహనాన్ని కూడ ఈ సిరీస్ పరీక్షిస్తుంది. అతను చాలా విషయాలను నియంత్రించుకోలేదు. అలాంటప్పుడు పెద్ద ప్లేయర్లు విసుగుచెందుతారు. ఈ టెస్టును గంభీర్ పాస్ కావాలి. గంభీర్‌కు ఈ పర్యటన చాలా కీలకం. ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఆసిస్ గడ్డపై భారత్ రాణించకపోతే గంభీర్ విమర్శలు ఎదుర్కొంటాడు. కాబట్టి, గంభీర్ ప్రశాంతంగా ఉండాలని, జట్టు బాగా ఆడాలని కోరుకుంటున్నా.’ అని తెలిపాడు.