Canada to India : కెనడా నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

by Sathputhe Rajesh |
Canada to India : కెనడా నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు బిగ్ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు ఆ దేశ రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. ఇండియాకు వెళ్లే ప్యాసింజర్ల భద్రతా తనిఖీలను మరింత పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాత్కలిక భద్రతా తనిఖీలను పెంచినట్లు ఆ దేశ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ అనిత ఆనంద్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా తనిఖీల సమయం రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లు పేర్కొంది. 4 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని తాజా ప్రకటనలో ఎయిర్ కెనడా సూచించింది. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లను టార్గెట్ చేసినట్లు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లలో సిక్కులు ప్రయాణించవద్దని గురుపత్వంత్ పన్నూ వీడియో విడుదల చేశాడు. ఒక వేళ ప్రయాణిస్తే మీ లైఫ్ డేంజర్‌లో ఉన్నట్లే అని తీవ్రంగా హెచ్చరించాడు. స్వచ్ఛందంగా ఎయిర్ ఇండియాను బహిష్కరిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశాడు. దీంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్, కెనడాలోని ఎయిర్ పోర్టులలో భద్రత పెంచాలని ఒటావాలోని ఇండియా హై కమిషన్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

Next Story

Most Viewed