Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 ఉద్యోగాలు.. జీతం ఎంతటే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-19 17:50:23.0  )
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 ఉద్యోగాలు.. జీతం ఎంతటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 253 స్పెషల్ ఆఫీసర్(Special Officer) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.centralbankofindia.co.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2024. డిసెంబర్ 14న ఈ పరీక్షను నిర్వహిస్తుండగా.. 2025 జనవరి రెండో వారంలో ఇంటర్వ్యూలు(Interviews) కండక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ముంబై, హైదరాబాద్ నగరాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

పోస్టు పేరు, ఖాళీలు:

స్పెషల్ ఆఫీసర్ - 253

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

పోస్టును బట్టి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175 ఫీజు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ. 45,000 నుంచి 1,20,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed