Donald Trump: భారత ఐటీ రంగానికి ప్రయోజనకరంగా ట్రంప్ విధానాలు: విప్రో ఛైర్మన్

by S Gopi |
Donald Trump: భారత ఐటీ రంగానికి ప్రయోజనకరంగా ట్రంప్ విధానాలు: విప్రో ఛైర్మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నిక కావడంపై భారత ఐటీ దిగ్గమ విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధికారంలోకి రావడం వ్యాపారానుకూలం, వృద్ధికి సానుకూలమన్నారు. ముఖ్యంగా టెక్ సేవల పరిశ్రమకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ట్రంప్ ప్రభుత్వం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల తమ కస్టమర్లకు సహాయపడుతుంది. ఇది ప్రపంచంతో పాటు భారత్‌కు కూడా ప్రయోజనకరం. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తక్కువ పన్నులు, నిబంధనలు కంపెనీలు, పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల గురించి ప్రస్తావించిన ప్రేమ్‌జీ, ప్రత్యేకించి టారిఫ్‌లు, ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలో ఐటీ సంస్థలు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే, అమెరికా నుంచి అత్యధిక సంఖ్యలో వర్క్ వీసాలను పొందుతున్న భారత్ అమెరికా విధానాలు, హెచ్-1బీ వర్క్ వీసాలపై పరిమితులు ప్రభావితం చేయగలవని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలోకి రావడం భారత ఐటీ రంగానికి సానుకూలంగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed