HYD: సిద్ధిఖ్‌నగర్‌లో భవనం ఒరగడానికి కారణమిదే!

by Gantepaka Srikanth |
HYD: సిద్ధిఖ్‌నగర్‌లో భవనం ఒరగడానికి కారణమిదే!
X

దిశ, శేరిలింగంపల్లి: విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు.. 60 గజాల స్థలాల్లో 6 అంతస్థుల బిల్డింగ్‌లు.. ఒకరి గోడకు అనుకుని ఇంకో నిర్మాణం.. ఎక్కడా నిబంధనలు అనే మాటే లేదు.. కనీసం పక్క వారికి ఇబ్బంది అవుతుంది అన్న ధ్యాసే లేదు. ఎవరికి వారుగా గాలి మేడలు కట్టేస్తున్నారు. తాజాగా తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం పక్కన ఓ నిర్మాణం కోసం పునాది తవ్వగా పక్కనే ఉన్న నిర్మాణం పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శేరిలింగంపల్లి(Serilingampally) సర్కిల్ 20 పరిధిలోని గచ్చిబౌలి(Gachibowli) డివిజన్ సిద్ధిఖ్‌నగర్‌(Siddiq Nagar)లో ఓ బహుళ అంతస్థుల నిర్మాణం ఉండగా.. దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్ తవ్వుతున్నారు.

దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బ తినడంతో ఆ భవనం ఓ పక్కకు ఒరిగింది. దీంతో ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో చుట్టుపక్కల వారు భయాందోళను గురై సామాన్లు తీసుకుని ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న హైడ్రా(Hydra) అధికారులు, డీఆర్‌ఎఫ్(DRF) బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని ఆభవనం చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణ కోసం సెల్లార్ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏక్షణమైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story