- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UNICEF: రెండు నెలల్లో లెబనాన్‌లో 200 మందికి పైగా చిన్నారులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లాను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం ప్రారంభించినప్పటి నుంచి లెబనాన్‌లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ఐరాస మంగళవారం ప్రకటనలో తెలిపింది. 'రెండు నెలల్లో లెబనాన్‌లో 200 మందికి పైగా పిల్లలు హత్య చేయబడ్డారు. ప్రతిరోజు సగటున ముగ్గురు పిల్లలు చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ(యూనిసెఫ్) పేర్కొంది. ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. చాలామంది గాయపడ్డారు. ఈ రెండు నెలల్లో 1,100 కంటే ఎక్కువ మంది పిల్లలు క్షతగాత్రులయ్యారు. 'లెబనాన్ పిల్లలకు ఈ పరిస్థితులు సాధారణమైపోయాయని' యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ విలేకరులతో అన్నారు. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దెబ్బతిన్న గాజాలో ఉన్న పిల్లలకు ఏం జరిగిందో అవే పరిణామాలను లెబనాన్‌లోని పిల్లలు ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలో కనీసం 17,400 మంది పిల్లలు మరణించారు. గాజాలో జరిగిన విధంగానే దారుణ పరిస్థితులు సాధారణమైపోతున్నాయి. లెబనీస్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన 3,452 మందిలో 231 మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన 14,664 మందిలో 1,330 మంది చిన్నారులు ఉన్నారు.