- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambati Rambabu : పోలవరంపై చంద్రబాబు అసత్యాలు : అంబటి రాంబాబు
దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీలో పోలవరం(Polavaram)పై చంద్రబాబు అన్నీ అబద్దాలు చెప్పారంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 వరకు చంద్రబాబుకు అసలు పోలవరం ఆలోచనే లేదని.. అసలు పూర్తి చేయాలన్న ఆలోచన కూడా లేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మరిప్పుడు రాష్ట్రం ఆ ప్రాజెక్టును ఎందుకు తన చేతుల్లోకి తీసుకుంది అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం తప్పితే రాష్ట్రానికి మంచి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. రాష్ట్రమే పోలవరం నిర్మించాలనుకోవడం చారిత్రక తప్పిదం అన్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం జాప్యం అవుతోందని పేర్కొన్నారు. గోదావరి డైవర్షన్ పూర్తి కాకుండానే.. డయాఫ్రమ్ వాల్ కట్టడం ఎంత తప్పో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. మోడీ, చంద్రబాబు కలిసి పోలవరాన్ని నాశనం చేశారని అంబటి అగ్రహించారు. ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేయడం వలన ఉత్తరాంధ్ర నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- Tags
- ambati rambabu