- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో మహిళా స్వీపర్లకు సెలవుల్లేవ్
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో పాలకమండలి పెద్దలు, బల్దియా బాసు, పరిపాలన, ఆర్థిక విభాగాధిపతులంతా మహిళలే అయినా మహిళా స్వీపర్లకు న్యాయం జరగకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెల్లవారుజాము వరకు మెయిన్ రోడ్లు, సబ్ రోడ్లు, కాలనీ రోడ్లన్నీ శుభ్రపరిచే మహిళా కార్మికులను సెలవులు లేకుండా పనిచేయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్‌గా ఆమ్రపాలి, అడ్మి్న్ సెక్షన్ హెడ్‌గా నళినీ పద్మావతి, ఫైనాన్స్ విభాగం హెడ్‌గా గీతా రాధిక, ఐటీ హెడ్‌గా స్నేహా శబరీశ్, యూబీడీ అదనపు కమిషనర్‌గా సునంద రాణి, యూసీడీ అదనపు కమిషనర్‌గా సౌజన్య, కమాండ్ కంట్రోల్ ఇన్‌చార్జిగా అనురాధ వంటి మహిళా అధికారులు కీలక విధులు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో మహిళా స్వీపర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వెలుగులోకి రావడం లేదు. పైగా జీహెచ్ఎంసీలో మహిళా అధికారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ ఉన్నా, ఆ కమిటీని నియమించినట్లు మహిళా స్వీపర్లకు సమాచారం లేదు. ఒకవేళ ఉన్నా, వారిని ఈ కమిటీ పట్టించుకోవడం లేదు. కారణంగా క్షేత్రస్థాయిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, శానిటరీ జవాన్లు, మెడికల్ ఆఫీసరు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ల చేతిలో మహిళా స్వీపర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది.
అది.. కుదరదు..
ఇప్పటి వరకు అమలు చేసిన విధానం ప్రకారం.. మహిళా కార్మికులకు వారంలో ఓ రోజు వీక్లీ హాలిడే ను అమలు చేస్తుండగా, శానిటేషన్ విభాగంలోని కొందరు అధికారులు తాజాగా సరికొత్త కండీషన్‌ను తెరపైకి తెచ్చారు. ఈ కండీషన్‌తో నగరంలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని సుమారు 15 వేల పైచిలుకు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్మికులంతా వారంలో ఆరు రోజులు డ్యూటీ చేస్తేనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, పని చేయాల్సిన ఆరు రోజుల్లో ఏఒక్క రోజు డుమ్మా కొట్టినా, సెలవు పెట్టుకున్నా, వీక్లీ ఆఫ్‌ను కట్ చేయటంతో పాటు సెలవు పెట్టుకున్న రోజుతో పాటు రద్దయ్యే వీక్లీ ఆప్‌తో కలుపుకుని రెండు రోజుల జీతాల్లో కోతలు విధిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. పైగా ఒక్కోరోజు ఒక్కో కార్మికురాలికి వీక్ ఆఫ్ ఉండటంతో ఒకరికి సెలవు అవసరమైతే, మరో కార్మికురాలి వీక్ ఆఫ్‌ను వినియోగించుకుని, సెలవు తీసుకుని, తిరిగి సదరు కార్మికురాలి వీక్ ఆఫ్ రోజు సెలవు తీసుకున్న కార్మికురాలు డ్యూటీలు చేసుకునే వారు. కానీ సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చిన అధికారులు ఇప్పుడు అదేమీ కుదరదంటూ మహిళా స్వీపర్లకు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.
- Tags
- Telugu News
- GHMC