అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

by Sridhar Babu |
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారులు, డిప్యూటీ డీఈవోలు, డిప్యూటీ ఐఓఎస్, డీఈలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 384 పాఠశాలల్లో పనులు చేపట్టగా ఇప్పటివరకు 235 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, 149 పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన మంచినీరు

సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, రిపేర్ తదితర పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినందున నిర్దేశించిన వ్యవధిలో పనులను పూర్తి చేయాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం విద్యాశాఖ పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య , హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసి అప్ డేట్ చేయాలని అన్నారు. గైర్హాజర్ అవుతున్న పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని, తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఉర్దూ అక్షరాస్యతను పెంచుటకు కృషి చేయాలని అన్నారు.

Advertisement

Next Story