- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్, భారతీయ విశ్వవిద్యాలయాల మద్దతు మాటల్లో చెప్పలేం: ఫరీద్ మముంద్ జాయ్
దిశ, సికింద్రాబాద్: కొవిడ్ తో పాటు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారత్, భారతీయ విశ్వవిద్యాలయాలు తమకు అందించిన మద్దతు మాటల్లో చెప్పలేమని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఓయూ ఈసీ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తో ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి బృందం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్ పూణే విశ్వవిద్యాలయాల తర్వాత అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉస్మానియా సహా తెలంగాణ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పాస్ పోర్ట్ పునరుద్ధరణ, స్కాలర్ షిప్ ల జారీకి సంబంధించిన సమస్యలున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కౌన్సిలర్ ఖాదిర్ షా, హైదరాబాద్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక కాన్సుల్ జనరల్ సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహీంఖిల్, సెడిఖుల్లా సహర్, ఇద్రెస్ మముంజాయ్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ సిబ్బంది పాల్గొన్నారు.