గణేష్ నిమజ్జన వేడుకల్లో పాముతో విన్యాసాలు..కేసు నమోదు

by Aamani |
గణేష్ నిమజ్జన వేడుకల్లో పాముతో విన్యాసాలు..కేసు నమోదు
X

దిశ, సికింద్రాబాద్: గణేష్ నిమజ్జన వేడుకల్లో పలువురు నిర్వాహకులు ఇష్ట రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వింత పోకడలకు పోతూ జనాలను అలరించేందుకు కొండ చిలువను పోలిన భారీ సర్పం(పాము)తో విన్యాసాలు చేస్తూ చెలగాటం ఆడుతున్నారు. తార్నాక విజయపురి కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని ఊరేగింపు వేడుకలు శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఇందులో ప్రజలను అలరించేందుకు, ఆకట్టుకునేందుకు వింత వింత రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. అఘోరా వేషధారణలో ఉన్న కొందరిని తీసుకొచ్చి పాము తో విన్యాసాలు చేశారు. ప్రజల మధ్యలో ఈ విధంగా విష సర్పంతో విన్యాసాలు చేస్తున్న విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సదరు కొండచిలువ పామును తీసుకొని వెళ్లారు. పాముతో విన్యాసాలు చేస్తున్న వ్యక్తిపై అదే విధంగా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed