ప్రాంతీయత నేపథ్యంలో కథలు చెబితే పాఠకుడికి ఆసక్తి ఉంటుంది

by Sridhar Babu |
ప్రాంతీయత నేపథ్యంలో కథలు చెబితే పాఠకుడికి ఆసక్తి ఉంటుంది
X

దిశ, రవీంద్ర భారతి : వాస్తవికతతో ప్రాంతీయత నేపథ్యంలో కథలు చెబితే పాఠకుడికి ఆసక్తి ఉంటుందని, ఆ అంశాలతో ‘నీ స్నేహం కోసం’ సంపుటి లోని కథలు ఉన్నాయని ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో కామన్ డయాస్, రవ్వలకొండ విశ్వబ్రాహ్మణ వేదిక ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తంగెళ్ల పల్లి కనకాచారి రచించిన

నీ స్నేహం కోసం సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు రుద్ర శంకర్ సంపుటి ఆవిష్కరించి మాట్లాడారు. సంపుటిలోని ప్రతి కథ మన అనుభవాలు గుర్తు చేస్తాయని తెలిపారు. ఇందుకు కారణం కనకా చారి జర్నలిస్ట్ గా సమాజాన్ని సూక్ష్మ పరిశీలన చేయటమే అన్నారు. సంపుటిని రచయిత్రి హైమవతి భీమన్నకు అంకిత మిచ్చారు. వట్టి కోట అల్వార్ స్వామి పురస్కారాలను పలు రంగాల ప్రముఖులకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ వేత్త లలిత వాణి, డాక్టర్ మామిడి హరికృష్ణ, జీవీఆర్ చారి, దైవజ్ఞ శర్మ, రచయిత్రి శైలజ మిత్ర, జయసూర్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed