ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్యం

by Sridhar Babu |
ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్యం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని, బండ్లగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రులలో డెంగ్యూ కిట్ లు, ఎలిజా, ఆర్డీఎస్ తగినంత ఉన్నాయా, రోజుకు ఎన్ని టెస్ట్ లు నిర్వహిస్తున్నారనే వివరాలను ఫార్మసి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ ఆస్పత్రి లో ఐసీయూ వార్డ్, ఫార్మసీ, హాజరు రిజిస్టర్, ఫార్మసీ లో మందుల నిల్వలను పరిశీలించారు.

వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు . ఆరాంఘడ్ శివరాంపల్లి కి చెందిన ఎస్.హర్షిత్ రెడ్డి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా కుటుంబ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి వారిని ఓదార్చారు. బండ్లగూడ పట్టణ ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించి ఆపరేషన్ థియేటర్, డ్రెస్సింగ్ రూమ్, ఫార్మసీని తనిఖీ చేశారు. ఆన్ లైన్లో మందుల వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రజల కుండా ఆసుపత్రి సిబ్బంది వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, ఫీవర్ ఆస్పత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ జయ శ్యామ్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story