పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు

by Kalyani |
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు
X

దిశ, సిటీ క్రైమ్ : హైదరాబాద్ పాత బస్తీ కి చెందిన ప్రజలు భారతీయ సంస్కృతిని, పండుగలను వ్యతిరేకిస్తారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకుడు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత బస్తీ ప్రజలు మత సామరస్యం తో అన్ని పండుగలను గౌరవిస్తారని , శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారని ఎంఐఎం నాయకుడు ఎక్స్ లో వివరించాడు. డిప్యూటీ సీఎం ఈ విధంగా కామెంట్ చేయడం శాంతి భద్రతలను కాపాడడంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను అవమాన పరచడమే నని, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కూడా అవమాన పర్చడమేనన్నారు. రెండు దశాబ్దాలుగా నగరంలో ఏలాంటి మతపరమైన ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనికి స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ న్యాయ నిపుణులతో చర్చిస్తామని, దానికి అనుగుణంగా చర్యల ప్రక్రీయ ఉంటుందని ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed