- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైన్‌మెన్ల కాసుల దందా..! వాటర్ వర్క్స్‌లో ఇష్టారాజ్యం
దిశ, మెహిదీపట్నం: జల మండలిలో లైన్‌మెన్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న మాదిరిగా లైన్‌మెన్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్‌లు వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చాలా చోట్ల వాటర్‌లో ప్రెజర్ సమస్య ఉంది. ఈ ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల కంటే తక్కువ నీరు వస్తుంది. దానిని అదనుగా చేసుకున్న ఆయా ప్రాంతాల్లోని లైన్‌మెన్లు అందినకాడికి దండుకుంటున్నారు. లో ప్రెజర్ నీటి సరఫరా ప్రాంతాల వినియోగదారుల నుంచి ప్రతినెలా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక చేసేది లేక వినియోగదారులు లైన్‌మెన్లు అడిగిన కాడికి డబ్బులు సమర్పించుకుంటున్నట్లు తెలిసింది. బయటి మార్కెట్‌లో ట్యాంకర్లు కొనుగోలు చేసే బదులు లైన్‌మెన్లకు ఎంతో కొంత ఇస్తున్నారని సమాచారం.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
లైన్‌మెన్లు డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం ఉన్నతాధికారులకు కూడా తెలుసని, ఉద్దేశపూర్వకంగానే వారు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు వసూలు చేసే డబ్బులో కొంత వారికి కూడా ముట్టచెబుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జనమండలి ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అది వాస్తవం కాదు..
లైన్‌మెన్లు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం వాస్తవం కాదు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వాటర్ వర్క్స్ జీఎం మహేందర్ నాయక్ తెలిపారు.