సమంతకు అరుదైన డిసీజ్.. కారణమిదేనంటోన్న డా. రాజీవ్

by S Gopi |   ( Updated:2022-10-30 14:36:25.0  )
సమంతకు అరుదైన డిసీజ్.. కారణమిదేనంటోన్న డా. రాజీవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శరీరంలోని రోగ నిరోధక శక్తి రివర్స్ ​కొట్టడంతోనే సినీనటి సమంతకు కండరాల వ్యాధి ఎటాక్ ​చేసినట్లు డా. రాజీవ్ తెలిపారు. సమంతకు ఆటో ఇమ్యూన్ ప్రభావంతో వచ్చిందన్నారు. శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టం సొంత కణాలు, కణాజాలంను శత్రువులుగా భావించి దాడి చేసిందన్నారు. చాలా తక్కువ మందికి ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. వైరల్​ఇన్​ఫెక్షన్లు, శరీరంలో తీవ్ర గాయాలు, యాంటీబయాటిక్​లు విరివిగా వాడినప్పుడు ఇలా సంభవించే అవకాశం ఉన్నదన్నారు. ఈ వ్యాధి వచ్చినోళ్లకు కండరాల బలహీనత, నొప్పి, ఎక్కువ సేపు నిలబడే శక్తి లేకపోవడం, నీరసంతో ఉంటారన్నారు. దీని వలన మానసిక మనోవేదన కూడా ఉంటుందన్నారు. రక్త పరీక్షలు ద్వారా మజిల్​డ్యామేజ్​ను గుర్తించవచ్చన్నారు. రక్తంలో కణాజాలానికి నష్టం చేసే ఎంజైమ్స్​(క్రియాటిన్​కినస్(సికే), అల్డోలేస్​ఎంజైమ్​లు పెరిగితే వ్యాధి నిర్ధారణగా భావించాలన్నారు. అంతేగాక కండరాల కణజాలంపై ఆటో యాంటీబాడీస్​ప్రభావాన్ని రక్త పరీక్షల ద్వారా తేలుతుంది. ఇక ఎలక్ట్రోమైగ్రాఫీ ద్వారా కండరాల పనివిధానాన్ని పరిశీలించన్నారు.

అంతేగాక మజీల్ బయాప్సీ ద్వారా కూడా మైయోసిస్​కారణాన్ని తెలుసుకోవచ్చని డా. రాజీవ్​ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని స్పష్టంగా చెప్పలేమన్నారు. కానీ కొన్ని చికిత్స విధానాల ద్వారా కండరాలను స్ట్రాంగ్​చేసుకునే వెసులుబాటు ఉన్నదన్నారు. యాంటీ ఇన్​ప్లామేటరీ డ్రగ్స్, స్టీరాయిడ్స్, ఇమ్యూనోస్రప్రెంట్​డ్రగ్స్, ఇమ్యూనోగ్లోబిన్స్​మందులను శరీర పరిస్థితులను బట్టి డాక్టర్లు రిఫర్ చేస్తారన్నారు. ఇక ఫిజికల్, మజిల్​వ్యాయామాలు చేయాల్సి ఉంటుందన్నారు. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే వ్యాధి మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్నదన్నారు. నీరసం, కండరాల నొప్పి, వాపును ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నోళ్లు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.


డా. రాజీవ్



Read more:

1. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా - Samantha ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed