నగరంలో కుండపోత వర్షం.. వరదలో కొట్టుకొచ్చిన మృతదేహం

by Mahesh |
నగరంలో కుండపోత వర్షం.. వరదలో కొట్టుకొచ్చిన మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఎవరూ ఊహించని విధంగా భారీ వర్షం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2 గంటల పాటు నాన్ స్టాప్‌గా వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షపాతం 10 సెంటీ మీటర్లు దాటింది. రాజేంద్రనగర్ 11, యూసఫ్‌గూడలో 12, ఉప్పల్ 10, గోల్కొండ 10, వెస్ట్ మారేడ్ పల్లి 10, పికెట్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ముషీరాబాద్ పార్సిగుట్టలో నీటిలో కారు కొట్టుకుపోగా.. వరదలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిలో కొట్టుకొచ్చింది. భారీగా వరద ప్రవహిస్తుండటంతో పార్సిగుట్ట లో పలు ప్రాంతాలు ప్రమాద అంచుల్లో కి వెళ్ళాయి.

Advertisement

Next Story

Most Viewed