- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్లక్ష్యంగా ఆఫీసర్‌ల డ్యూటీలు
దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని కీలకమైన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని అక్కడి పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. సీపీ అవినాశ్ మొహంతికి నిబంధనలు నిక్కచ్చిగా పాటిస్తారని పేరు ఉంది. కానీ కింది స్థాయి అధికారుల్లో చాలా మంది దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ దళిత మహిళ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఘటన తెలిసిందే. రూ.200ల కోసం జరిగిన గొడవలో పోలీసులు చేసిన నిర్లక్ష్యంతో ఎస్‌ఐ కావాలనుకున్న యు వకుడు 2 నెలల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. కొడుకు కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసిన తల్లిదండ్రుల ఇప్పుడు ఆర్ధికంగా రోడ్డున పడ్డారు. ఇలా కింది స్థాయి అధికారులు చేస్తున్న తప్పిదాలు బాధితుల ప్రాణాలు తీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తప్పుడు సమాచారంతో..
కింది స్థాయి నుంచి సీపీ వరకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఫిర్యాదులపై ఉన్నతధికారులు విచారణ జరిపినా వారికి స్థానిక పోలీసు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి డైవర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సీపీకి అసలు విషయం తెలియడం లేదని పోలీసు వర్గాల్లోనే చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. విచారణకు వచ్చే సిబ్బంది, అధికారులు ఫీల్డ్ వర్క్ చేయకుండా ఫిర్యాదుదారులతో మాట్లాడకుండా స్థానిక రాజకీయ నాయకులు, ఇతర గ్రూప్ ప్రతినిధు లు ఇచ్చిన సమాచారంతో రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు అం దిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మా ఆఫీసర్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు..
ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు బాధితులను పరేషాన్ చేస్తున్నారని తెలిసింది. సార్ మా ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు కదా..ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని అడిగితే చాలా సందర్భాల్లో ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్‌ల నుంచి మా పైఅధికారులు ఈ కేసులో ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అందుకే మీ ఫిర్యాదుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారు అంటూ బాధితులను చక్కర్లు కొట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విసుగెత్తిన బాధితులు నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని సున్నితంగా బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలా బాధితులు పోలీసు స్టేషన్, ఏసీపీ, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సంఘటనలు అనేకం సై బరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దర్శనమిస్తాయని, ఇటీవల వెలుగుచూసిన సంఘటనలతో కొంత మంది సీనియర్ ఆఫీసర్‌లు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం మొత్తం సైబరాబాద్ పోలీసులకు అప్రతిష్టను తీసుకువస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.