- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు కేసుల్లో 21.45 కేజీల గంజాయి పట్టివేత
దిశ,కార్వాన్ : ఒరిస్సా నుంచి హైదారాబాద్‌కు రైల్లో గంజాయి రవాణవుతున్నందనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ ఏ టీమ్ శుక్రవారం మల్కాజి గిరి రైల్వే స్టేషన్‌లో మాటు వేశారు. గంజాయి వస్తుందనే సమాచారం మేరకు సంచులతో రైలు దిగిన ఎస్ కె అహ్మమద్ అలీ(రాజమండ్రి)ని పట్టుకొని అతడి వద్ద ఉన్న 17.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆరాతీయగా ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్ సింగ్‌కు ఇవ్వడానికి తీసుకవచ్చినట్లు అంగీకరించాడు. ఒరిస్సా కు చెందిన పాండు అలియాస్ పబిత్ర నాయక్ హైదరాబాద్ దాూల్‌పేట్‌కు చెందిన రాహుల్ సింగ్‌కు గంజాయి పంపిస్తాడని నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ టి ఎఫ్ సీఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్‌కె ఆహ్మమద్‌ను గంజాయిని మల్కాజి గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో అప్పగించినట్లు పోలిసులు తెలిపారు.
మరో కేసులో..
అప్పర్ ధూల్‌పేట్ హాజారీ హోటల్ సమీపంలో ఎస్ టి ఎఫ్ , ఎక్సైజ్ కలిపి శక్రవారం ఉదయం నిర్వహించిన రూట్ వాట్‌లో నలురుగు నిందితుల వద్ద 4.238 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం మేరకు నిర్వహించిన రూట్ వాచ్‌లో భాగంగా గంజాయితో పట్టుబడిన నలుగురిని విచారించగా మరో ఎనిమిది మందికి గంజాయి అమ్మకాలతో సంబంధాలు ఉన్నాయని నిందితులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో గణేష్, రాహుల్ సింగ్, అంకిత్, లడ్డు సింగ్‌లు ఉన్నారు. పరారీలో యూసఫ్, చరణ్, శంకర్, అమన్ సింగ్, అదర్శసింగ్, ముఖేష్ సింగ్, ఎన్‌కె ఆహ్మమద్, సుమరాజ్ గులారీలు ఉన్నట్లు పోలిసులు తెలిపారు. రెండు చోట్ల గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ఎస్ టి ఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజి రెడ్డి, ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ సీఐలు మధుబాబు, గోపాల్, ఎస్ టి ఎఫ్ సీఐలు మధు , ఎంపిఆర్ చందశ్రేఖర్, ఎస్సైలు సాయి కిరణ్,, భరత్‌కుమార్, భాస్కర్‌రెడ్డి అజీమ్, శ్రీధర్ హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు ప్రకాష, రాకేష్, మహేష్ ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.