Tirumala:యోగుల పర్వతం పై ఘనంగా కార్తీక మహా దిపోత్సవం

by Jakkula Mamatha |
Tirumala:యోగుల పర్వతం పై ఘనంగా కార్తీక మహా దిపోత్సవం
X

దిశ ప్రతినిధి,తిరుపతి: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని యోగుల పర్వతం పై కార్తీక దీపం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీచే వెలిగించారు. సాయంత్రం 6 గంటలకు 1503 కిలోల ఆవు నెయ్యి, 2007 మీటర్ల ఒత్తు, 6 అడుగుల రాగి ప్రమిదలో సుమారు 40 కిలోమీటర్లు కనిపించే మేరా కార్తీకదీపం ను వెలిగించారు . ఉదయం నుండి యోగుల పర్వతంపై ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలాగే సుబ్రహ్మణ్యం స్వామికి నాగదేవతలకు పూజలు చేశారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు కొరకు పలువురిచే భజనలు చేశారు . శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు యోగులు పర్వతం పైకి వచ్చే భక్తులకు దారి పొడుగునా త్రాగునీరు, పర్వతం పై నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది . భక్తులందరూ ఈ యొక్క కార్తీక దీపం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed