Sambhavi Choudhary : బీహార్ యువ మహిళా ఎంపీ ఔదార్యం.. ఐదేళ్ల వేతనం డొనేట్

by Sathputhe Rajesh |
Sambhavi Choudhary : బీహార్ యువ మహిళా ఎంపీ ఔదార్యం.. ఐదేళ్ల వేతనం డొనేట్
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన బీహార్ ఎంపీ శాంభవి చౌదరి ఐదేళ్లలో తాను అందుకునే వేతనాన్ని సమస్తిపూర్ నియోజకవర్గంలోని బాలికల విద్యకు అందజేయనున్నట్లు గురువారం ప్రకటించారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా ‘యంగెస్ట్ ఎన్డీఏ క్యాండిడేట్’ అని ప్రధాని మోడీచే పిలవబడిన ఈ యువ మహిళా నేత ‘పడేగా సమస్తిపూర్ బడేగా సమస్తి‌పూర్’ డ్రైవ్‌లో భాగంగా తన వేతనాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో తాను పొందే జీతాన్ని చదవు మధ్యలో మానేసిన బాలికల విద్య పూర్తి చేయడం కోసం ఖర్చు చేస్తానని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఈ యువ ఎంపీ అన్నారు. సమస్తిపూర్ జిల్లాగా ఏర్పడిన రోజు నుంచి ఈ ప్రొగ్రామ్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. ప్రజలు ఓటు వేయడం ద్వారా కేవలం తనను ఎంపీని చేయలేదని వారికి కూతురిని కూడా చేశారని తెలిపారు. నితీష్ కుమర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న అశోక్ చౌదరి కూతురే శాంభవి చౌదరి. ఆమె తాత మహావీర్ చౌదరి స్వాతంత్ర్య సమరయోధుడు, మరియు కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు మంత్రిగా పనిచేశారు.

Advertisement

Next Story