2 రోజులు, 5 సభలు, రెండు రోడ్ షోలు.. ఇదీ పవన్ మహారాష్ట్ర షెడ్యూల్

by srinivas |   ( Updated:2024-11-15 17:21:03.0  )
2 రోజులు, 5 సభలు, రెండు రోడ్ షోలు.. ఇదీ పవన్ మహారాష్ట్ర షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. మహారాష్ట్రలో ఈ నెల 20న ఎన్నికల జరగనున్నాయి. మొత్తం 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో తెలుగు ప్రజలుండే నియోజకవర్గాల్లో కూటమి తరపున ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శనివారం ఉదయం నాందేడ్ జిల్లా డెంగ్లూర్ నిరయోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ సభ, రాత్రి 6 గంటలకు షోలాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు. 17న (ఆదివారం) విదర్భ ప్రాంతం చంద్రపూర్ జిల్లా బల్లార్ పూర్ బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభకు పవన్ కల్యాణ్ హాజరవుతారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed