- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila:జమిలి ఎన్నికల బిల్లు పై వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!?
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జమిలి ఎన్నికల బిల్లు పై ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారత రాజ్యాంగం పై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఫైరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల(Jamili election) బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. పూర్తి మెజారిటీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండు వంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలింది అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. చివరకు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టింది. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172 లను కూడా సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీల(Assembly) గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. జమిలి ద్వారా దానికి గండి కొట్టే అధికారం కేంద్రానికి లేదు. దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశం. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.