TGTET-2024 II Exams:టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

by Jakkula Mamatha |   ( Updated:2024-12-18 11:21:07.0  )
TGTET-2024 II Exams:టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) టెట్(TET-2) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టెట్ పరీక్షల షెడ్యూల్(TET Exam Schedule) విడుదల అయింది. వచ్చే ఏడాది(2025) జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో టెట్ హాల్ టికెట్లు(Hall Tickets) డిసెంబర్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు, పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. రెండు సెషన్స్ లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 11.30కు ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 04.30 గంటలకు ముగుస్తుంది. అయితే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. టెట్ పరీక్ష హాల్ టికెట్ల కోసం ఈ https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Advertisement

Next Story