- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టులను నమ్మి మోసపోవద్దు
దిశ, ఆసిఫాబాద్ : మావోయిస్టుల మాయమాటలు నమ్మి ఆదివాసీ యువత మోసపోవద్దని, వారికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం సిర్పూర్ యు మండలంలోని పవర్ గూడలో పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివాసీలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, విక్రయించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు.
చదువుతో అభివృద్ధితో పాటు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్నారు. జిల్లాలో గంజాయి నివారణకు గిరిజన యువత పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు లావాదేవీ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం నాలుగు గ్రామాల ప్రజలకు 300 దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, జైన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సీఐ రమేష్ తదితరులు ఉన్నారు.