- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభానికి ముందే కూలిపోతున్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు..
దిశ,కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే కూలి పోతుండడంతో కాంట్రాక్టర్ తిరిగి మరమత్తులు చేపడుతున్నాడు . ఇటీవల కొమురవెల్లిలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో ఇటీవల కూలినపోయిన కిటికీ పర్థకు మరమ్మత్తు పనులు చేపట్టారు. మల్లికార్జున స్వామి క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవన పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపం తోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు,భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల క్యూ కాంప్లెక్స్ భవనం రెండవ అంతస్తులు వివిధ డిజైన్లతో నిర్మించిన కొన్ని నిర్మాణ భాగాలు నాణ్యత లేక కూలిపోగా దానిని మరమ్మత్తు చేశారు. తాజాగా బుధవారం మొదటి అంతస్తులో వెలుతురు పడేందుకు, వర్షం కురిస్తే నీళ్లు లోపలికి రాకుండా ఏర్పాటు చేసే నిర్మాణానికి సంబంధించిన (సజ్జ )ఓ నిర్మాణం కూలి పోయింది.
దీంతో కాంట్రాక్టర్ ఎవరి కంట పడకుండా మరమ్మత్తు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వేలాది మందికి ఉపయోగపడే క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయంటే భవిష్యత్తులో పరిస్థితి ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల వసతి కోసం ఉపయోగపడే భవనాల నిర్మాణ పనుల్లో ఆలయ అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిటీతో పనులు చేయించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులపై ప్రత్యేక విచారణ చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.