BJP: ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.. ఎంపీ రఘునందన్ రావు

by Ramesh Goud |
BJP: ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.. ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం ఘటన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని మెదక్(Medak) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) ఆరోపించారు. ఖమ్మం,(Kammam) దానవాయిగూడెం(Danavayigudem) బీసీ బాలికల గురుకుల హాస్టల్ లో ఓ విద్యార్థినిని ఎలుకలు కొరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు.. కష్టాల కడలిలో గురుకుల విద్యార్థుల ప్రాణాలు, భవిష్యత్ అని, విద్యార్థినికి 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు అని ప్రశ్నిచారు.

పలుమార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదని, గురుకులాల్లో రోజు రోజుకు దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం(State Government) నిద్రపోతున్నదా అని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పాలనలో(Congress Governance) విద్యార్థుల భవిష్యతు అంధకారంలో ఉగుసలాడుతుందని విమర్శలు చేశారు. ఇక భవిష్యతులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిని(Education Minister) నియమించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని బీజేపీ నేత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed