Soldiers killed: శిక్షణా సమయంలో పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

by vinod kumar |
Soldiers killed: శిక్షణా సమయంలో పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: శిక్షణా సమయంలో ప్రమాదవ శాత్తు మందు గుండు సామగ్రి పేలడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌(Rajasthan)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్‌ జిల్లా (bikaneer distric)లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌(Field firing range) లో బుధవారం ట్రైనింగ్ ప్రక్రియలో భాగంగా పలువురు సైనికులు యుద్ధ ట్యాంకులో మందుగుండు సామగ్రిని లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరొక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సైనికుల మృతదేహాన్ని సూరత్‌గఢ్‌లోని మిలటరీ ఆస్పత్రి (Militery hospital)కి తరలించారు. అలాగే గాయపడిన సైనికుడిని హెలికాప్టర్‌లో చండీగఢ్‌కు తరలించినట్టు సర్కిల్ ఆఫీసర్ లుంకరన్సర్ నరేంద్ర కుమార్ పూనియా తెలిపారు. మరణించిన సైనికులను ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన అశుతోష్ మిశ్రా(Ashuthosh Mishra), రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన జితేంద్ర(Jithendra)గా గుర్తించారు. మందుగుండు సామగ్రి లోడ్ చేసే క్రమంలో చార్జర్ పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణ చేపట్టింది. కాగా, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో 4 రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. అంతకుముందు ఈనెల 15న తుపాకీని అమర్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Next Story

Most Viewed