అంకాపూర్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి..

by Naveena |
అంకాపూర్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి..
X

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ లో బుధవారం మాట్లాడారు. అంకాపూర్ గ్రామ రైతులు ఏడాదికి నాలుగు పంటలు ఎక్కువగా పండిస్తారని, అన్ని అర్హతలు ఉన్న గ్రామం అంకాపూర్ గ్రామం అని అన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటన చేసినపుడు నుత్పల్లి,కుద్వన్పూర్ వంటి హాస్టల్స్ లో కనీస వసతులు లేవని, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు చేయడం లేదని, విద్య వ్యవస్థ లో చిన్న పొరపాట్ల వల్ల మొత్తం ఇబ్బందులు అవుతుందన్నారు. డొంకేశ్వార్ మండలానికి జూనియర్ కళాశాల, నండిపేట కి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన ప్రభుత్వానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..అతిత్వరలో ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడిన వాటి పై నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed