- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Umar Khalid: ఉమర్ ఖలీద్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ (Umar khalid)కు ఊరట లభించింది. 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనకు ఢిల్లీ కోర్టు (Delhi court) ఏడు రోజుల మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. తన బంధువు వివాహానికి హాజరయ్యేందుకు గాను10 రోజుల బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. డిసెంబరు 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఉపా కేసు కింద అరెస్టైన ఖలీద్ గత నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. కాగా, 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. అయితే ఘర్షణకు ముందు మత ఉద్రిక్తతలు పెరిగేలా ఖలీద్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను అదే ఏడాది సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం అనేక సార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది.