- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూముల మాయాజాలం.. తహసీల్దార్ నివాసగృహంలోనే భూముల రిజిస్ట్రేషన్..?
దిశ, కాటారం : రెక్కాడితే డొక్కాడని గ్రామీణ ప్రజలు సాగుకు నోచుకొని భూములను చెట్టు పుట్ట కొట్టి భూములను సాగు చేసుకుంటే ఆ భూములపై రాజకీయ భూ బకాసురుల కన్ను పడింది. వాణిజ్య పంటలు పండుతున్న ఆ నల్ల బంగారం ను ఎలాగైనా కాజేయాలని రాజకీయ నేతలు కుటిల యత్నాలకు పూనుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో సుమారు 100 ఎకరాల భూమిని మా యొక్క రైతుల పొట్టగొట్టి పగిలి వారసులను పుట్టించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని బడా సిమెంట్ కంపెనీకి భూమి విక్రయించిన సంఘటనతో ఈ ప్రాంతంలో భూముల రాజకీయ దుమారం ప్రారంభమైంది. ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
విషయమేమిటంటే...
పలిమెల గ్రామ శివారులో మస్తే దారు బాబు ఖాన్ పేరిట పలు సర్వే నెంబర్ లో వందల ఎకరాల భూమి ఉంది సీలింగ్ సమయంలో పట్టాదారులు భూములు వదిలి వెళ్ళిపోయారు అలాగే రికార్డులో కొన్ని దశాబ్దాల పాటు ఉంది రెండు దశాబ్దాల క్రితం భూములకు కొంతమేర డిమాండ్ ఏర్పడడంతో రాజకీయంగా ఎదిగిన నాయకులు ఈ భూములపై దృష్టి సారించారు. రెండు, మూడు దశబ్దాలుగా కొన్ని వందల ఎకరాలలో ఆ గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ ఇతర రైతులు ఆ భూములను సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయ సేద్యం చేస్తూ జీవిస్తున్నారు. ఆ భూములలో పంటలు బాగా పండుతుండడం, భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు లేవని తెలిసి, బాబు ఖాన్ పేరిట వారసులొచ్చారు. వారసుల పేరిట కొంతమంది వ్యక్తుల కు ఈ భూములను విక్రయించారు. రెవెన్యూ అధికారులు, రాజకీయ నేతలు గ్రామానికి చెందిన పలుకుబడి కలిగిన నాయకులు ఏర్పడి ఈ భూముల కుంభకోణానికి తెరతీశారు. బిఆర్ఎస్ తీసుకొచ్చిన భూముల చట్టం ధరణి ద్వారా ఈ భూములపై దృష్టి సారించిన కొందరు వ్యక్తులు పట్టాలు పొందినట్లు తెలుస్తోంది.
వారసుడు ద్వారా పట్టాలు పొందిన కొంతమంది వ్యక్తులు 2021లో వారి భూములను ఎకరాకు రూ 2.90 లక్షలకు మీడియేటర్ ద్వారా దక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. విషయం బయటికి ఒకడంతో కొంతమంది రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు నిలిచిపోయింది. పలిమెల శివారులోని సర్వే నెంబర్ 199, 165 ,183, 221, 184/1,250, 173, 251/2,352/2,225/1/2, 50/1,228/2,166,180,179,172,50,211,250,1, 251/3, 223,,167/1/2, 50/2, 225/1/1/2,226/1 సర్వే నెంబర్లు గల భూమిలో విస్తీర్ణం 102.35 ఎకరాల భూమిని సదరు వ్యక్తుల నుంచి దక్కన్ సిమెంట్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం తో అసలు విషయం బయటకు వచ్చింది. మరో 100 ఎకరాలకు సిమెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. విషయం ఏమిటంటే భూమి సాగు చేస్తూ మోకా మీద ఉన్న రైతుల పేర్లు లేవు. ఈ భూములలో సాగు చేస్తున్న రైతులు పట్టాదారులు కాకుండా ఇతరుల పేర్లు ఉండడంతో భూములను రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ కుంభకోణానికి తెర తీసినట్లయింది.
ఆందోళనలో రైతులు అండగా కాంగ్రెస్ నాయకులు..
సాగు చేసుకుంటున్న భూములను పట్టాలు ఉన్నాయని నెపంతో ఇతర బినామీ దారులు దక్కన్ సిమెంట్ కంపెనీకి విక్రయించిన అంశంపై ఆ రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇది ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాసటగా నిలుస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. రెండు రోజులలో పలిమెల గ్రామంలో సాగు చేసుకుంటున్న రైతుల లను సర్వే నెంబర్ల వారీగా పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులు విచారణ చేస్తూ నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన భూముల విషయంపై రైతుల వాంగ్మూలాలను సేకరించి నివేదికను సీసీఎల్కు పంపించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు భూములను రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దారుపై ఉన్న అధికారుల ఆదేశానుసారం తదుపరి చర్యలు కొనున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పలిమెల మండల తహసిల్దార్ సెలవు పై వెళ్లారు.
తసీల్దార్ నివాస గృహంలో రిజిస్ట్రేషన్..
దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కి 102 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారమంతా పలిమెల తహసీల్దార్ సర్వర్ సత్తార్ గ్రామంలో నివాసముంటున్న గృహంలో జరిగినట్లు తెలుస్తోంది. కార్డులు అంతా సక్రమంగా ఉంటే మండల రెవెన్యూ కార్యాలయంలో జరగాల్సిన రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా సిబ్బందికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసినట్లు సమాచారం. ధరణి ఆపరేటర్ కు ఈ భూముల విషయంపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ లో కాకుండా తాసిల్దార్ ఇంట్లో రిజిస్ట్రేషన్ వీరిద్దరూ కుమ్మక్కై పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి కుంభకోణానికి తెర తీసినట్లు మండలంలో చర్చించుకుంటున్నారు. భూముల మాయాజాలంపై పూర్తిస్థాయిలో ఒక ప్రత్యేక టీం వేసి విచారణ జరిపి బాధ్యులైన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు ఆ భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పించాలని కోరుతున్నారు.