- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమస్యలను పరిష్కరించండి
దిశ, నేరడిగొండ : బోథ్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించండని ముఖ్యమంత్రికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విన్నవించారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ని రెవెన్యూ డివిజన్ చేయాలని. నూతన ఫైర్ స్టేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, కుప్టి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, పిప్పలకోటి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కోరారు. ఇచ్చొడలో నూతన పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని, బరంపూర్ నుంచి మూర్ఖండి రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు.
సిరిచేల్మా నుంచి పెంబి వరకు అటవీ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని, పురాతన సిరిచేల్మా మల్లికార్జున దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, దేగామ గ్రామ ORR ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని, బోథ్ నియోజకవర్గంలో నెలకొన్న గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.